![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -286 లో... అప్పుని అనామిక పేరెంట్స్ అవమానిస్తూ ఉంటారు. అది చూసిన కనకం, కృష్ణమూర్తి ఇద్దరు వాళ్ళ దగ్గరకు వచ్చి.. మా అమ్మాయిని ఎందుకు అలా అంటున్నారని అడుగుతారు. మీరు కళ్యాణ్ కి మీ కూతురుని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు కదా అని అనామిక పేరెంట్స్ అంటారు. అయిన మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అంతా అంటూ కనకాన్ని కూడా అవమానిస్తారు.
ఆ తర్వాత వాళ్ళ మాటలని తట్టుకోలేని అప్పు.. అనామిక వాళ్ళ నాన్న కాలర్ పట్టుకొని బెదిరిస్తుంది. ఏమి చేస్తున్నావ్ ఆగు అంటు అప్పుపై కృష్ణమూర్తి చెయ్యి ఎత్తుతాడు. మా కూతురు, మీ అమ్మాయికి ఏమి అన్యాయం చెయ్యదంటూ అప్పుని కనకం అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఏంటి అంత జరిగిన సైలెంట్ ఉన్నారని అనామిక అమ్మ తన భర్తని అడుగుతుంది. గొడవ ఎందుకు? ఈ పెళ్ళి జరగాలి.. మన అప్పులు తీరాలని అనామిక నాన్న అంటాడు. మరొకవైపు కావ్య, స్వప్న ఇద్దరు అరుణ్ ఎక్కడ వచ్చి.. అందరి ముందు స్వప్న కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని చెప్తాడోనని స్వప్న టెన్షన్ పడుతుంది. నీ వల్లే ఇదంతా.. నీ మాటలు విని నువ్వు చెప్పినట్టు వింటే వాన్ని రెచ్చగొట్టినట్లు అయిందని స్వప్న అంటుంది. అప్పుడే కళ్యాణ్, అనామికల పెళ్లికి వచ్చిన పద్మావతి.. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ అరుణ్ ని పట్టుకొని అందరి ముందు నిజం చెప్పేలా చేద్దామని అనుకుంటారు. నాకు మీరు ఒక హెల్ప్ చెయ్యాలి విక్కీ.. వాళ్ళ బావ నిజస్వరూపం అందరికి తెలిసేలా చెయ్యాలని పద్మావతి అంటుంది. దానికి కావ్య, స్వప్న ఇద్దరు సరే అంటారు.
మరొకవైపు రాహుల్, రుద్రాణి కలిసి స్వప్నని నెగెటివ్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అరుణ్ తో కలిసి ప్లాన్ చేస్తుంటే.. విక్కీ వాళ్ళ బావ వస్తాడు. మీరు బానే ప్లాన్ చేస్తున్నారు. నేను మీ ప్లాన్ లో భాగం అవుతాను. మీరు నాకొక హెల్ప్ చెయ్యాలి. నాకు కావాలని అనుకున్న ఆ పద్మావతి నాకు దక్కకుండా పోయింది. అది నాకు సొంతం అయ్యేలా చేయాలని విక్కీ వాళ్ళ బావ, రుద్రాణి, రాహుల్ తో డీల్ కుదర్చుకుంటాడు. మరొకవైపు విక్కీ-పద్మావతి, రాజ్- కావ్య జంట ఇద్దరు సరదాగా ఒకరికొకరు ఆట పట్టించుకుంటారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |